సిక్స్త్ సెన్స్ సీజన్ 5 లో ఈ వారం జెడి. చక్రవర్తి చాల ఫన్ క్రియేట్ చేసాడు. అలాగే ఎగ్ బ్రేక్ చేసే టాస్క్ లో ఓంకార్ జెడిని కొన్ని ప్రశ్నలు అడిగాడు. "మీరు మీ కెరీర్ లో ఏ హీరోయిన్ ని ఐనా ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించారా ?" అని ఓంకార్ అడిగాడు "మా నాన్న మీదొట్టు...అందరినీ ట్రై చేశా." పడనివాళ్ళు ఏవారైనా ఉన్నారా అని మళ్ళీ అడిగాడు.. "ఇంప్రెస్ చేయడం వేరు, పడేయడం వేరు..రెండు వేరు వేరు సబ్జక్ట్స్...ఐ ట్రై టు ఇంప్రెస్ ఎవ్రీ వన్ అండ్ ఎనీవన్ . పడేయడం అంటే సెకండ్ సబ్జెక్టు...ఫస్ట్ సబ్జెక్టు గురించి మాట్లాడితే...సుస్మితాసేన్ ఫస్ట్ చెప్పుకోవాలి...ఎందుకంటే ఆమెకు తెలుగు రాదు కాబట్టి ధైర్యంగా చెప్పా.."మీ కెరీర్ లో మీరు చూసిన వాళ్ళల్లో మీకు బాగా నచ్చిన హీరోయిన్ ఎవరు" అని అడిగాడు.
"శ్రీదేవి గారు...ఆమె తర్వాతే ఎవరైనా. అమల అంటే ఇష్టం ఒక మంచి మనిషిగా, మంచి యాక్ట్రెస్ గా .. రంభ, మనీష కొయిరాలా, ఈషా రెబ్బ వీళ్లంతా కూడా ఇష్టం " అని చెప్పాడు.. తర్వాత లాస్ట్ వీక్ "దయా" టీం నుంచి వచ్చిన విష్ణుప్రియ జెడి చక్రవర్తి అంటే ఎంత ఇష్టమో చెప్పిన వీడియో క్లిప్ ని ప్లే చేసి ఆయన ఉద్దేశం ఏమిటి అని అడిగాడు ఓంకార్. "విష్ణుప్రియ నా మూవీస్ తో లవ్ లో పడింది. నాతో కాదు. దీనికి కారణం మా డైరెక్టర్. ఆయన 40 రోజుల పాటు నా సినిమాలు చూపించారు. ఆమె పగలంతా నన్ను చూసి రాత్రి నా సినిమాలన్నీ చూసేసరికి కన్ఫ్యూజ్ అయ్యింది.
ఆ ఆమ్మాయి క్లియర్ గా చేప్పింది కదా వీడియోలో నన్ను అడిగినా నేను రిజెక్ట్ చేసాను అని..అర్ధం కాకపొతే వ్యర్థం ఐపోతావు అని నేను ఆమెకు చెప్పేసాను... నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోమంటూ రోజూ చెప్పేవాడిని".. అన్నాడు చక్రవర్తి. ఈ మధ్య కాలంలో సావిత్రి, సేనాపతి, ప్రేమ ఇష్క్ కాదల్ మూవీస్ ని డైరెక్ట్ చేసిన యంగ్ డైరెక్టర్ పవన్ సాదినేని. ఇప్పుడు "దయా" అనే వెబ్ సిరీస్‌తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ప్రముఖ నటుడు జెడి చక్రవర్తి ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. "శివ" మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జేడీ చక్రవర్తి తర్వాత గులాబి, బొంబాయి ప్రియుడు, సత్య వంటి మూవీస్ తో హీరోగా సక్సెస్‌లను అందుకున్నాడు. విలన్‌గా కొన్ని మూవీస్ లో కనిపించాడు. వెర్సటైల్ యాక్టర్‌గా పేరు సంపాదించిన జేడీ చక్రవర్తి ఫస్ట్ టైమ్ తెలుగులో ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు.